రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి : ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించి, ఆయనను గౌరవించడం మన భాధ్యత అని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కంచనపల్లి నర్సింగరావు కోరారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం కు జ్ఞానమాలను (51వ వారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల శ్రేయస్సు కోసం గొప్ప గొప్ప పదవులు తృణ ప్రాయంగా వదిలిపెట్టిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు మనదేశంలోనే కాకుండా విదేశాల్లో చదివి గొప్ప వాళ్ళుగా అవుతున్నారని ఆయన అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు జ్ఞానమాలను సమర్పించిన,నా జన్మ ధన్యం అయిందని ఆయన అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ళ శేఖర్ రెడ్డి మరియు నాయకులతో మాట్లాడి అసెంబ్లీ లో తీర్మానం చేయుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మునిసిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ సాధన సమితి జిల్లా నాయకులు బర్రె సుదర్శన్, ఇటుకల దేవేందర్ బొడ్డు కృష్ణ సిలివేరు రమేష్ దండు కృష్ణ సిలివేరు రమేష్ దర్గాయి దేవేందర్, భూతం యాదగిరి బుగ్గ రమేష్ రావుల రాజు ముత్యాల ఆనంద్, నీలం నర్సింహ, కత్తి కొండల్, నల్ల కృష్ణ, ఉప్పల శాంతి కుమార్, బట్టు మురళి, తదితరులు పాల్గొన్నారు.