రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా :ఆలేరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, సూర్య విలేకరి,తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు శనిగరం శ్రీనివాస్ యొక్క తల్లి శనిగరం.ప్రమీల మాతృవియోగం చెందినారు.

కావున వారి కుటుంబ సభ్యులను” తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్” యాదాద్రి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్ బాబా కలిసి పరామర్శించారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుళ్ళ సిద్ధులు, జిల్లా ఉపాధ్యక్షులు గుండు మధుసూదన్, ఆలేరు మండల అధ్యక్షులు బోడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.