రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 4 /భువనగిరి పట్టణంలోని స్థానిక చెరువు కట్టను శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి మరియు గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ ఎన్న బోయిన ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేసినారు. ఈ సందర్భంగా వారు పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి గుట్టను ఎమ్మెల్యే సొంత నిధులతో హిటాచి ద్వారా లెవలింగ్ చేయడం జరుగుచున్నదని, ఆ తదుపరి హెచ్ఎండిఎ అధికారులకు అట్టి చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగినదని మరియు వీలైనంత త్వరలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.