రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ గారు జ్యోతిప్రజ్వలన చేసి విద్యార్థులకు ఉపాధ్యాయ శిక్షణా సర్టిఫికేట్ ఏ విధంగా సంస్కరణ చేందినదో దిశా నిర్దేశం తెలియజేశారు. వాత్సల్య కళాశాల చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ హాజరై ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు చేర్పులు జరిగిన సందర్భంగా నూతన ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి అని సూచించారు. పూర్వ బాల్యదశ విద్యార్థులకు ఏ విధంగా బోధించ వలేనో అలవాటు చేసుకోవాలి. మరియు దరిపల్లి ప్రవీణ్ కుమార్ అన్ని రంగాల వారికి చెందిన మానవ వనరుల ను తయారుచేసేది కేవలం ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.అదేవిధంగా ప్రధమ సంవత్సారం డిక్టిన్షన్ ర్యాంకు సాధించిన ఎస్ గంగాషిల, వై సంధ్య లకు ప్రశంస పత్రాలను ఛైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు అధ్యాపకులు అభిషేక్, శ్రావణ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, యాకూబ్ పాల్గొన్నారు.