రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 4/యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఓ బిసి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ పై వ్యాటు తగ్గిం చాలని ఓబీసీ జిల్లా అద్యక్షులు బి.లక్ష్మీనారాయణఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని స్థానిక గాంధీ పార్కు వద్ద నిరసన తెలియజేశారు.
ఓబీసీ రాష్ట్ర ఇంచార్జి అనంద్ గౌడ్ మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై పది రూపాయలు తగ్గించగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిం చారు.రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించ కపోతే భారతీయ జనతా పార్టీ వివిధ మోర్చాల ద్వారా నిరస నలు,బందులు రాస్తారోకోలు నిర్వహిస్తామని డిమాండ్  చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు పాదరాజు ఉమాశంకర్ రావు, పట్టణ కార్యదర్శి బద్దం బాల్ రెడ్డి  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్,కర్నాటి. ధనుంజయ్,పోతాంశెట్టి.రవీందర్,ఓబీసీజిల్లాకార్యదర్శి. హీరేకర్.కిషన్ జి కౌన్సిలర్లు మాయ దశరథ,రత్నపురం బల రాం,జనాగం.కవిత నరసింహ చారి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.