రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 4 / రాజపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అనంతరం ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి అడిగి తెలుసుకున్నారు వెంటనే జిల్లా వైద్యాధికారి సాంబశివ రావు చరవాణి ద్వారా తెలియపరచి వెంటనే సిబ్బందిని నియమించమని ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రికి పరిశీలించి ఒక స్వచ్ఛంద సంస్థ వారు అదనంగా 10 బెడ్స్ తో కూడిన అదనపు గదిని ఏర్పాటు చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చారని దానికి తగ్గట్టుగా సిబ్బంది ఉన్నట్లయితే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశముందని ఆస్పత్రి సిబ్బందితో చర్చించారు ఆసుపత్రిలో కాన్పు ఎలా అవుతుంది అని మరియు వ్యాక్సినేషన్ రెండవ డోసు ఎంత పర్సంటేజీ అయిందని విచారించారు వ్యాక్సినేషన్ పక్రియను డిసెంబర్ మాసాంతరములోగా పూర్తిచేయాలని ఆదేశించారు.