రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల :జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మిమిక్రి కళాకారుడు గరిగే వేణుగోపాల్ , ఆంధ్రప్రదేశ్ లోని జ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన పురస్కారాల కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా శనివారం అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా కందిమాలయ పల్లి(బ్రహంగారి మఠం)లోని యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ హాజరై,పురస్కారాలను అందచేసి,మాట్లాడారు. దేశంలో,రాష్ట్రంలో ఎంతోమంది స్వంచంద సంస్థలు ఏర్పాటు చేసి,పెదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజా సేవలోనే కాలం గడుపుతున్నారని,అలాంటివారిని,కాళాకారులను గుర్తించడానికి ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన జ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్,టిటిడి మాజి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ కుమార్,వివిధ స్వంచంద సంస్థల సభ్యులు,కళాకారులు పాల్గొన్నారు.