రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 4 /ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా శనివారం భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ మహిళా కమిషన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ కాలేజీల మహిళా ప్రిన్సిపాల్స్, జిల్లా మహిళా అధికారులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, మహిళా ఉద్యోగులు హాజరైన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,మహిళలు తాము పనిచేస్తున్న రంగాలలో ఏ స్థాయిలో కూడా తమ హక్కులను కోల్పోవద్దని, పరిస్థితులలో అధిగమించేలా ధైర్యంతో, సాధికారికంగా ఉండాలని అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై జరిగే దురాచారాలు, గృహ హింస, లైంగిక వేధింపులు, అకృత్యాల పట్ల చట్టాలు కఠినంగా ఉన్నాయని, చట్టాల పట్ల మహిళలు పూర్తి స్థాయి అవగాహనతో ఉండాలని అన్నారు. కుటుంబాలలో మహిళల హక్కులను గౌరవించాలని, కూతురైనా కోడలైనా సమానంగా చూడాలని, మగ ఆడ అనే లింగ వివక్ష లేకుండా సమానంగా చూడాలని అన్నారు. మగవారితో సమానంగా ఆడవారికి ఆస్తి హక్కు సమానంగా ఉందని, మహిళలు ఆర్థిక స్వావలంబనతో ఉండడం చాలా ముఖ్యమని అన్నారు. మహిళలు తమ తోటి మహిళల పట్ల ఆదరణ, అండతో ఉండాలని, ఏ స్థాయి మహిళా ఉద్యోగిని అయినా కూడా తమ ఉనికిని కోల్పోవద్దని అన్నారు. మహిళలు విశ్రాంతి లేకుండా ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఇలాంటి మహిళా చట్టాల సదస్సులు, కార్యాచరణ సదస్సులు తరచూ నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.నల్గొండ జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం.భవాని మాట్లాడుతూ, రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులను కల�