రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 4 /భువనగిరి పట్టణంలోని అనంతారం గ్రామ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి వసతులను పరిశీలించారు.ఆశ్రమ పరిసరాలను, భోజనశాలను పరిశీలించారు. విద్యార్థినులను మెనూ ప్రకారం భోజన వసతి కల్పిస్తున్నారా అని, వారికి ఇవ్వాల్సిన బెడ్ షీట్స్, బూట్లు, నోట్ బుక్స్, బట్టలు, బ్యాగ్స్, కాస్మటిక్స్ ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థినులను పలకరించి బాగా చదువుకోమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తానాయక్, ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ జాన్సన్ ఉన్నారు.