సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల ఆత్మీయ సత్కార సమావేశంలో మాట్లాడుతున్న ఈటల
కేసీఆర్ పాలనలో
పైరవీకారులకే పెద్దపీట

రాయల్ పోస్ట్ న్యూస్ ఖైరతాబాద్, : రాష్ట్రంలో నేడు జర్నలిస్టు లకు సొంత పత్రికల్లో కూడా వాస్తవాలను రాసే స్వేచ్ఛ లేదని, యూట్యూబ్ ఛానళ్ల లోనూ వాస్తవాలను బయటపెట్టలేని దుస్థితి ఉందని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జర్నలిస్టులను అణచివేస్తూ, బెదిరిస్తూ అదుపులో పెట్టుకున్నామని కొందరు అనుకుంటున్నారని, కానీ ఈ అణచివేతే రేపటి పతనానికి సంకేతం అవుతుందన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుబ్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈటలను జర్నలిస్టులు, చిన్న పత్రికలు, మైనార్టీ సంఘాల జేఏసీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు, ప్రాంతీయ దినపత్రికల ఎడిటర్లు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తాము వెళ్లలేని చోటుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. సొంత రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు,
ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుకున్నా మని, కానీ నేటి పాలనలో అవన్నీ కలలుగానే మి గిలాయన్నారు. “రాష్ట్రం కోసం పోరాడినవాళ్లను పక్కనపెట్టి, పైరవీకారులకు పెద్దపీట వేశారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే”అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచంలో పెట్టాడు” అని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, చట్టాల ఉల్లంఘన, మద్యం ఏరులై పారడం లాంటి విషయాలు మీడియా ద్వారానే ప్రపంచానికి తెలిసిందన్నా రు. హుజూరాబాద్ ప్రజలు అమ్ముడుపోలేదని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. “ధర్మం డబ్బుతో నడవదురా” అని చెంపపై కొట్టారని కామెంట్ చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ ఉద్యమకారులు తనపై పెట్టిన బా ధ్యతను మరువనని, వారికోసం రాజీలేకుండా పోరాడతానన్నారు. చిన్న పత్రికలు, జర్నలిస్టుల సమస్యలపై పోరాడేందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. సమావేశంలో ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ తిరుమలగిరి సురేందర్, తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు కప్పర ప్రసాద్ జర్నలిస్టు,mjf యదాద్రి భువనగిరి నాయకులు మొహమ్మద్ ఖాజా ఫసిఉద్దిన్ మత్యాస్ వెంకన్న బురాన్ అల్వాల హనుమంతు, నసీరుద్దీన్ ఖాద్రి, సూర్యా రావు, దయానంద్, బింగి స్వామి, ఆజమ్ ఖాన్, అఖ్తర్ హుసేన్, గౌస్ మొహమ్మద్, భూపతి రాజు, రవీందర్ రెడ్డి ఆఫ్రోజ్ ఖురేషి, మాధవ రెడ్డి, బింగి స్వామి,షానూర్ బాబా, రాజి రెడ్డి, మొహమ్మద్ ఖాసీం, మోహిసిన్ అలీ, సందేశ్ భరద్వాజ్, అమన్, అనిల్, సమ్మయ్య గౌడ్, వెంకటయ్య, ఖతీబ్, మారుతి చౌదరి, సత్యం, రామకృష్ణ, దిడ్డి శ్రీనివాస్, జోహారి, రాము, ఎర్రమిల్లి రామారావు, వెంకటేష్, సత్యనారాయణ, విజయ్, , , అఫ్తాబ్, నగేష్, జగన్, మూర్తి, విజయ కుమార్, రఫీఖ్, రెహ్మాన్, ప్రభాకర్, పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇటీవల మరణించిన 120 మంది జర్నలిస్టులు, చిన్న పత్రికల సంపాదకులు మొహమ్మద్ రియాజ్, పడకంటె రమేశ్, సర్దార్ భాయి, నరసింహ గౌడ్, డ్యాన్స్ డైరెక్టర్ శివ శంకర్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్ర లకు సంతాపం ప్రకటించడం జరిగింది. చిన్న పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ స్వాగతం పలుకగా, డిప్యూటి ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ వందన సమర్పణ చేశారు.