రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 3 /పోచంపల్లి మండలం రహీమ్ ఖాన్ గూడ, జూలూరు గ్రామాల నర్సరీలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. జూలూరు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులకు సూచించారు. జలాల్ పురం గ్రామం పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్ పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్ లో సేంద్రియ ఎరువుల తయారీని పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్లో తయారైన సేంద్రియ ఎరువు పాకెట్ ను జిల్లా కలెక్టర్ కు బహుమతిగా ఇవ్వగా వారిని అభినందించారు. ఇంటింటా తడి పొడి చెత్త సేకరణ ద్వారా సేంద్రియ ఎరువుల తయారీతో గ్రామ పంచాయతీలు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని, దానికి తగిన విధంగా అధికారులు క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ నాగిరెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు.