రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 3 /డిసెంబర్ 5,6,7 తేదీల్లో భూదాన్ ఫోచంపల్లిలో జరుగు జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ భువనగిరి పట్టణ,మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ పేదప్రజాల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా ముందుంటు,పెదప్రజలకు అండ ఎర్ర జెండా అని అన్నారు.ఈ మహాసభల్లో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో సీపీఎం చేసిన ఉద్యమాలు కార్యక్రమలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారనిఅన్నారు.మహాసభలకు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొంటున్నారు.అదేవిధంగా 5వ తేదీన జరుగు వ్యవసాయ రంగ సంస్కరణ సభకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ , హజరవుతున్నారు కావున ఈ సెమినార్ ను విజయవంతం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ,మండల కార్యదర్శులు దయ్యాల నర్సింహ,మాయ కృష్ణ,పట్టణ,మండల కార్యవర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య,వనం రాజు,నాయకులు బందెల ఎల్లయ్య,ఎదునురి వెంకటేష్,వనం యాదగిరి, సందెల రాజేష్,ఈర్ల రాహుల్, పల్లేర్ల సందీప్,పాలడుగు రవి,శివ తదితరులు పాల్గొన్నారు.