పత్రికా ప్రకటన

🔹 పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిటిషనర్లతో పోలీసులు మర్యాదగా మెలాగాలి…

రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల :ఈ రోజు అనగా తేదీ:-03-12-2020 శుక్రవారం నాడు బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ గారు మందమర్రి పోలీస్ స్టేషన్ తనిఖీ కి వచ్చిన సందర్భంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్(సి.ఐ) ప్రమోద్ రావు గారు,మందమర్రి ఎస్సై భూమేశ్ గారు పులా బొకే తో స్వాగతం పలికారు.

అనంతరం పోలీస్ స్టేషన్ని తనిఖీ చేసి…వర్తికల్ కి సంబంధించిన సిబ్బంది తో సమావేశం నిర్వహించి,పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.మరియు పెండింగ్ కేసుల ఫైల్స్,రికార్డులను పరిశీలించారు.అలాగే నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.శాంతి భద్రతల పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏ.సి.పి గారు తెలిపారు.తదనంతరం,బ్లూ కోట్ విధులు,పెట్రో కార్ యొక్క విధులు,పిటిషన్ మేనేజ్-మెంట్ మరియు పోలీస్ స్టేషన్ యొక్క పనితిరును రిసెప్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ…పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే వారితో మర్యాదగా మెలాగలన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలగుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు.అదేవిధంగా పాత నెరగాళ్లపై నిఘా ఉంచాలని, 100 డయల్ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ…ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ…నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు.

అలాగే రోజు వారి వాహన తనిఖీలు చేస్తూ…రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చెప్పటాలని,డ్రంక్ & డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవరించాలని…రోడ్డు భద్రత నియమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని,పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు.

ఏసీపీ గారితో పాటు గారు,మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్(సి.ఐ) ప్రమోద్ రావు గారు,మందమర్రి ఎస్సై భూమేష్ గారు,ఏఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.