రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 3 / అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ లోని అమ్మ నాన్న దివ్యాంగుల ఆశ్రమాన్ని ఆమె సందర్శించి కేక్ కట్ చేశారు. మానసిక వికలాంగులకు సేవ చేస్తున్న ఆశ్రమ నిర్వహకులను ఆమె అభినందించారు. మానసిక దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరణతో ఉండాలని, తమ వంతు చేయూత అందించాలని అన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డిఓ సూరజ్ కుమార్, జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి, చౌటుప్పల్ అమ్మ నాన్న అనాథ ఆశ్రమ నిర్వాహకులు గట్టు శంకర్, తదితరులు పాల్గొన్నారు.