తుర్కపల్లి మండల కేంద్రంలో బి సి
సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఎరుకల వెంకటేష్ గౌడ్…

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 3 /తుర్కపల్లి మండల కేంద్రంలో బిసి సంక్షేమ సంఘం తుర్కపల్లి మండల అధ్యక్షులు ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల చలో ఢిల్లీ గోడ పత్రికల ను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహ, స్వామి మరియు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పడాల శ్రీనివాస్ ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రము చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణ లో భాగంగా బీసీల జన గణను కూడా చేపట్టాలని ఈనెల 13 14 15 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగు జంగ్ సైరన్ ధర్నా ను జిల్లా వ్యాప్తంగా బీసీలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచ్ లు మాజీ సర్పంచ్ లు పొగుల ఆంజనేయులు,నాంసాని సత్యనారాయణ,పూలపల్లి వెంకటేష్,గోనె కృష్ణ, దొమ్మాట బాబు,దానబోయిన నర్సింహులు, తదితర బిసి నాయకులు పాల్గొన్నారు