రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి : పురపాలక సంఘ పరిధిలోని 34 వార్డు కిసాన్ నగర్ లో గత కొంతకాలంగా కుక్కలు పందులు కోతుల నుండి ఇ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేడు స్థానిక కిసాన్ నగర్ మెయిన్ రోడ్డు పైన స్థానిక ప్రజలతో కలిసి వార్డు కౌన్సిలర్ కోలా దుర్గ భవాని గంగాధర్ గారు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా 34 వార్డు కిసాన్ నగర్ ప్రాంతంలో వందలాది కుక్కలు కోతులు ప్రజలను వెంబడించి గాయాలపాలు చేస్తున్నాయని అనేక సందర్భాలలో పురపాలక సంఘ కమిషనర్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ లకు ఫిర్యాదు చేసిన కనీసం పట్టించుకోని అటువంటి పరిస్థితి ఉన్నదని తన యొక్క వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని కుక్కలు వాహనదారులను వెంబడించి ప్రమాదాలకు గురి చేస్తున్నాయని ఈ విషయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజల ప్రాణాలు ప్రాణాలు గా భావించి అధికారులు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులను కూడా విజ్ఞప్తి చేస్తూ కుక్కలు మరియు కోతులను జనావాస ప్రాంతాల నుండి తరలించి అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఒకవేళ పురపాలక సంఘ అధికారులు వారం పది రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టకపోతే తన యొక్క కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేయడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్పీ మట్ట సభిత ,రామా,సుమా,భవాని,జ్యోతి,కిసాన్ యూత్ సభ్యులు శివ లక్ష్మణ్ దేవా సాయి ,26వార్డు కౌన్సిలర్ ఈరపాక నర్సింహ,28వార్డు కౌన్సిలర్ కైరంకొండ వెంకటేష్,యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట గిరీష్ కుమార్,అందే నరేష్ ,సురేష్,తదితరులు పాల్గొన్నారు.