స్టాఫ్ రిపోర్టర్ : ఎస్ కె.సుభాన్ పాషా

రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల జిల్లా: కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమగూడెం జాతీయ రహదారిపై రోడ్డు వెడల్పు కారణంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఒకవైపు రోడ్డు వేసి మరోవైపు డైవర్షన్ చేయడంతో రోడ్డు ఇరుకుగా వున్న రోడ్డులో వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.మంచిర్యాల నుండి కగజ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ పై వెళ్తున్న వారిపై దూసుకువచ్చి డీ కొట్టి సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకువెళ్లడంతో వెనక కూర్చున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.భర్త కు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కాసిపేట ఎస్ ఐ.నరేష్ తరలించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందాడు..పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.