సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

రాయల్ పోస్ట్ న్యూస్ యాచారం, రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా,యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామంలో గురువారం ఉదయం నల్లవెల్లి గ్రామానికి చెందిన జే.పెంటయ్యకు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రీలీఫ్ ఫండ్ రూ 29,000 చెక్కును యాచారం మండల జెడ్పిటిసి చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జంగయ్య, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి మహేష్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.