రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ పై వ్యాటు తగ్గించాలని పెట్రోల్ బంక్ ముందు నిరసన…

రాయల్ పోస్ట్ ప్రతినిధి(డిసెంబర్ 2 )భువనగిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీమహిళా మోర్చా అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ పై వ్యాటు తగ్గించాలని అద్యక్షురాలు సుర్వి లావణ్య అధ్యక్షత న నిరసన కార్యక్రమంచేపట్టారు
పట్టణంలోని స్థానిక హెచ్. బీ. పెట్రోల్ బంక్ ముందు నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సూరివి.లావణ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై పది రూపాయలు తగ్గించగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎందు కు తగ్గించడం లేదని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించ కపోతే భారతీయ జనతా పార్టీ వివిధ మోర్చాల ద్వారా నిరసనలు, రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు పాదరాజు ఉమాశంకర్ రావు, కౌన్సిలర్ రత్నపురం బలరాం,జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని.రాజమని,బండారు.సుశీల, జయంతి,గొనె.రూప,సాదువేల్లి.కలమ్మ కొటేష్,కాసుకుంట్ల.రమేష్,తదితరులు పాల్గొన్నారు.