రాయల్ పోస్ట్ న్యూస్ మెదక్ :తనకు పుట్టలేదని చిన్నారిని చంపేసిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని పాల్వంచ గ్రామానికి చెందిన బుర్ల రమణయ్య,సావిత్రి 2014 లో వివాహం చేసుకోగా మనస్పర్ధలతో 2016 లో విడిపోయారు.అనంతరం సావిత్రి వేరే వ్యక్తిని వివాహం చేసుకోగా వారికి వర్షిణి అమ్మాయి పుట్టగా,మనస్పర్థలు కారణంగా విడిపోయారు.ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లిన సావిత్రి,రమణయ్య లు అనుకోకుండా మరల కలవడంతో వారీరివూరి మధ్య విభేదాలను పక్కన బెట్టి, మరల వివాహం చేసుకొని దంపతులు ఇద్దరు గ్రామానికి వచ్చి నివసిస్తున్నారు. ఈ క్రమంలో సావిత్రి మరల గర్భవతి కావడంతో చిన్నారి వర్షిణి తనకు పుట్టలేదనే కారణంతో ద్వేషాన్ని పెంచుకొని,ఎలాగైనా చిన్నారిని అంతమొందిచాలి అని నిర్ణయించుకొని,మూడు రోజుల క్రితం సావిత్రితో కలిసి టేక్మాల్ ఆసుపత్రికి వెళ్లి,తిరుగు ప్రయాణంలో భార్యను ముందుగా గ్రామానికి పంపిన రమణయ్య పథకం ప్రకారం గ్రామ శివారులో చిన్నారిని గొంతు నులిమి చంపి,అనారోగ్యంతో మరణించిందని,అనుమానంతో భార్య సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసుల దర్యాప్తులో రమణయ్య తానే చిన్నారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని,హాంతకుడిని రిమాండ్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని మెదక్ డిఎస్పీ సైదులు తెలిపారు. ఈ కేసును తర్వాగా చెదిరిన సిబ్బందిని అభినందించారు. ఈకార్యక్రమంలో అల్లాదుర్గం సీఐ జార్జ్, ఏయస్ఐ తూకారం హేడ్ కానిస్టేబుల్ రవీందర్,కానిస్టేబుల్ లక్ష్మన్, సిబ్బంది పాల్గొన్నారు..