ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య …….

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 3 /హయత్ నగర్ మదర్ డైరీ వద్ద బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో 200వందల మంది చైర్మన్ లతో,రైతులతో కలసి ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య డిమాండ్ చేస్తూ కేసీఆర్ పాడి రైతులకు ఇస్తానన్న నాలుగు రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని,ప్రమాదంలో చనిపోయిన పశువులకు ఇన్సూరెన్స్ చెల్లించాలని మదర్ డైరీ లో అక్రమాలకు పాల్పడి డబ్బులు దండుకుంటున్న వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య