రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తా రంగారెడ్డి
కేంద్ర ప్రభుత్వం దేశం లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ సుంకన్ని తగ్గించి ఇన్నిరోజులు కావొస్తున్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధరలు తగ్గించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు తెలంగాణలో వెంటనే వ్యాట్ సుంకాన్ని తగ్గించాలని రాజేంద్రనగర్ ఆరంగార్ చౌరస్తా పై ధర్నా నిర్వహించారు.
బిజెపి అసెంబ్లీ కన్వీనర్ సురెడ్డి వినయ్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు తగించేతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై బిజెపి పోరాటాలు కొనసాగుతునే ఉంటాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్. మల్లేష్ యాదవ్. రవి శ్రీనివాస్ గౌడ్ సందీప్ ముదిరాజ్ .నిఖిల్ . రాకేష్ . విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.