రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :దేశంలో మైనార్టీల పై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రిన్స్ చౌరస్తా లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ గారు మాట్లాడుతూ మైనార్టీలపై దాడులు చేస్తూ లౌకిక, ప్రజాస్వామ్యాన్ని కూనీచేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారంగా మతం, కులం, లింగo, ప్రాంతం ఆధారంగా మనిషిపైన వివక్ష చూపకూడదని అన్నారు. దేశంలో దేశ పౌరులందరు సమానమే, ప్రతీ మనిషి స్వేచ్ఛగా జీవించవచ్చుఅని అన్నారు. కానీ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం రోజు రోజు కు పెరిగిపోతుంది. మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితులు, ఆదివాసులపై దాడులు పెరిగి పోయాయని తినే తిండిని సైతం వారి స్వేచ్చకు వదలకుండా, బలవంతంగా పౌరులపై రుద్దుతున్నారు. వినక పోతే భౌతిక దాడులు చేస్తూ,హత్యలు చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్,గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పెచ్చుమీరి పోతున్నాయి. కేంద్ర మంత్రులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలపై దాడులు చేసిన వారిని ప్రోత్సహిస్తున్నాయి. దాడులు చేసిన వారిపై కేసులు లేకుండా చేస్తున్నారు, వారికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మరింత ప్రోత్సహిస్తున్నాయి.

భారత రాజ్యాంగం పాలకుల వల్ల ప్రమాదంలో పడింది.దేశ పౌరులకు భద్రత లేకుండా పోయింది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దేశ పౌరులు అందరూ నడుంబిగించాల్సిన అవసరం ఉందని, మతోన్మాదం చెరలో నుండి భారత దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లాకమిటిసభ్యులు దాసరి పాండు,మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ,పట్టణ కార్యదర్శి మాయ క్రిష్ణ నాయకులు ఎదునూరి మల్లేశం,బందేల ఎల్లయ్య, బర్ల వెంకటేశ్,కల్లూరి నాగమణి, మటూరి కవిత పాల్గొన్నారు.