రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం లింగాపూర్ చౌరస్తాలో నిర్మించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పోలీస్ కిష్టయ్య 12 వ వర్ధంతి సందర్భంగా గౌరారం సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి , తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇమ్మడి గోపి మాట్లాడుతూ… తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన పోలీస్ కిష్టయ్య త్యాగం వృధా కాలేదు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి తొలి అమరుడుగ నిలిచాడని తెలిపారు. నేటికి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరారం పాలకవర్గం సభ్యులతో పాటు ముదిరాజ్ కులస్తులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కిష్టయ్య అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.