రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో పరిధిలో రెండు బైక్ దొంగతనాలు, 4 ఇండ్లలో చోరీలు చేసిన భీమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు స్థానిక సిఐ నవీన్ కుమార్ మీడియాకు బుధవారం తెలిపారు.
షాద్ నగర్ ఏసీపీ కుశాల్కర్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ నవీన్ కుమార్, ఎస్సైలు సురేష్ యాదవ్, సుందరయ్య, బాలస్వామి, క్రైమ్ టీం కానిస్టేబుళ్లు మోహన్ లాల్, యాదగిరి, శివ, శ్రీను, హోమ్ గార్డు రఫీలు ఎఫ్ఐఆర్ నంబర్ 935/2021 సెక్షన్లు 457, 380 ఐపిసి సెక్షన్ల కింద ఛేదించినట్టు వివరించారు. ఈ సందర్భంగా భీమేష్ ను అరెస్ట్ చేసి 3 లక్షల 50 వేల రూపాయలు, 8 తులాల బంగారం, 2 బైకులు స్వాధీనం చేసుకొని నిందితున్ని షాద్ నగర్ మేజిస్ట్రేట్ ఉత్తర్వు మేరకు జైలుకు తరలించినట్టు సిఐ పేర్కొన్నారు. పోలీసులు..