రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి:షాద్ నగర్ అర్బన్:పట్టణంలోని నెహ్రు నగర్ కాలనీలో ఉన్న సరోజినమ్మ ఆలయ పునర్నిర్మానణానికి గాను రంగారెడ్డి జిల్లా టియుడబ్లు(ఐజేయూ)ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం తనవంతు సహాయంగా రూ.21000/-లను విరాళంగా ఆలయ కమిటీ సభ్యులు,తెరాస యువ నాయకులు అడ్డు,బాలాజీలకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పలువురు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసినందుకు కమిటీ సభ్యులు, దేవాలయం తరపున ధన్యవాదాలు తెలిపారు.అలాగే దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజు, కుమార్ ముదిరాజ్, దేవేందర్,గడిల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు…