రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్: టిఆర్ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజు మీడియాతో మాట్లాడుతూ అధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాల కులాలు రాజకీయ అధికార పాలనా పదవులు పరంగా తరతరాలుగా అత్యంత వెనుక వేయబడి ఉన్నాయని ఇవ్వాళ పరిపాలనాపరంగా కొద్దిమంది మాత్రమే పదవుల్లో ఉన్నారని, తాము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ రాజకీయ ఆర్ధిక అధికార పదవుల పరంగా బడుగు బలహీన వర్గాలు ముందు వరుసలో వచ్చేలా చైతన్యం తెస్తున్నామని ఇప్పుడు రాష్ట్రంలోని యువత ఎంతో చైతన్యవంతమై రాజ్యాధికారం దిశగా ఆలోచనలు చేస్తుందని

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద కులాల ఓటు బ్యాంకులే రాజకీయాలను శాసించనున్నాయని ఎలా అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాయో అదేవిధంగా మెజారిటీ కులాలను ముదిరాజ్ కులంతో ఏకతాటిపైకి తెచ్చి ఐక్య కులాల జేఏసీగా ఏర్పాటు చేసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాల్లోని కులాల ఓటుబ్యాంకును దృశ్యా వారినే ఎమ్మెల్యే అభ్యర్తి గా నిలబెట్టి రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకోని రాజ్యాధికారం దిశగా పయనిస్తామని తెలియచేసారు

ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర మహిళ అధ్యక్షులతో శీలం సరస్వతి ముదిరాజ్,పిట్ల నగేష్, తోడేటి సత్యం ముదిరాజ్,రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కుడుముల శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ జెట్టి శంకర్,రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కోట్ల పుష్పలత, యాదగిరి,గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ లక్ష్మణ్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా కార్యదర్శి ధనలక్ష్మి,పవన్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు