రాయల్ పోస్ట్ నల్గొండ :రైతు ఉద్యమ స్ఫూర్తితో కార్మిక కోడ్ లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
తుమ్మల వీరారెడ్డి
రైతు ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లకు రద్దుకై ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు
మంగళవారం సిఐటియు జిల్లా విస్తృతస్థాయి సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా వీరా రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం సంవత్సరం పాటు పోరాటాలు నిర్వహించి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకున్న రైతాంగానికి సిఐటియు జేజేలు పలుకుతూ ఉందని అన్నారు. ఆ పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చిందని వీటిని రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు .పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికుల మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు .అన్ని రంగాల కార్మికులకు పిఆర్సి వర్తింప చేస్తామని హామీలు తప్ప అమలు జరగడం లేదని అన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని అంగన్వాడీ సెంటర్ లను ప్రాథమిక పాఠశాల లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 2,3 తేదీలలో భవన నిర్మాణ కార్మికుల సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు *సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, అవుతా సైదులు, నారబోయిన శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు దండం పల్లి సత్తయ్య, చింతపల్లి బయ్యన్న, నల్ల వెంకటయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల యాదయ్య ,గౌతమ్ రెడ్డి , కామల్లా గురువయ్య ,తిరుపతి రామ్మూర్తి, రొండి శ్రీనివాస్, అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ సాగర్ల యాదయ్య ఒంటె పాక వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, శేఖర్ రెడ్డి రామచంద్రు* తదితరులు పాల్గొన్నారు