రాయల్ పోస్ట్ నల్గొండ :పవర్లూమ్ కార్మికులు రేట్ల పెంపు కోసం డిసెంబర్ 10 లోపు యజమానుల మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు

మంగళవారం పవర్ లూమ్ వివర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జిల్లా బిక్షం, ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి లకు నోటీసు ఇవ్వడం జరిగింది డిసెంబర్ 31తో కూలి రేట్లు ఒప్పంద గడువు ముగియ నున్నందున త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నూతన రేట్లు పెంపుదలకు సహకరించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రస్తుతం ఇస్తున్న రేట్లు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్య వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారాయి అని అన్నారు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు
ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండెం రాములు జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు,జిల్లా ఉపాధ్యక్షుడు కర్నాటి శ్రీరంగం, పద్మనగర్, ఇండస్ట్రియల్ ఏరియా, చెర్లపల్లి ప్రాంతాల అధ్యక్షులు బొగు సత్యనారాయణ ,పెండెం బుచ్చి రాములు,చిట్టిపోలు వెంకటేశం ,కార్యదర్శి లు ఆంజనేయులు, గిరిబాబు ,కటకం రమేష్ యోగానంద రామకోటి తదితరులు పాల్గొన్నారు.