రాయల్ పోస్ట్ కెసముద్రం మహబూబాబాద్: కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాలలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచరాదని తక్షణమే తరలించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కేసముద్రం మండలం శౌర్య తండా మహమూద్ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.

ముందుగా శౌర్య తండా వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ సందర్శించి రైతులతో మాట్లాడారు.

ధాన్యం కొనుగోలు చేశారని నూట యాభై బస్తాలు ఉన్నాయని కాసోజు ఏకాంతాచారి కలెక్టర్కు వివరించడంతో ధాన్యం తరలించకుండా జాప్యం చేస్తుండడం,కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించడం కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్షాలు లేనప్పుడే, తేమ శాతం తక్కువ ఉన్నప్పుడే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.

ధాన్యం 12 గంటల లోపు కొనుగోలు చేయాలని,మూడు గంటల లోపు రవాణా చేయాలని ఆదేశించడం జరిగింది అన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా అనంతరం దిగుమతి చేసుకొనుటకు సమయము ఇవ్వాల్సి ఉంటున్నందున నిర్ణీత సమయంలో కొనుగోళ్లు చేపట్టి సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

మహమూద్ పట్నంలో టోకెన్స్ ఇచ్చి కొనుగోలు చేసినప్పుడు ధాన్యం ఎందుకు తరలించలేదని నిర్వాహకులు వెంకటాచలం ను కలెక్టర్ ప్రశ్నించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తహసీల్దార్ ను ఆదేశించారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి గదులను రికార్డ్స్ ను కలెక్టర్ పరిశీలించారు.

కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి సుధాకర్, తహసీల్దార్ కోమలి, ఎం.పి.ఓ. రఘుపతి రెడ్డి పి.ఏ.సి.ఎస్. వెంకటాచలం రైతులు పాల్గొన్నారు.