రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: భువనగిరి మండలం పెంచికలపాడు, రామచంద్రపురం, చందుపట్ల, బండసోమారం, ఎర్రమల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు‌, సెగ్రిగేషన్ షెడ్స్ , ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం నాడు పరిశీలించారు.

అనంతరం గౌస్ నగర్ నుండి బండసోమారం మార్గమధ్యంలో నడిచి వెళుతున్న ముగ్గురు విద్యార్థినులను గమనించిన జిల్లా కలెక్టర్ తన కారు ఆపి దిగి వారిని పలంకరించారు. విద్యార్థినులలో ఇద్దరు 8వ తరగతి, ఒకరు పదవ తరగతి చదువుతున్నారని తెలుసుకుని, ఆర్.వి.ఎం. లేదా ఇతర పథకం కింద సైకిళ్ళను మంజూరు చేస్తామని విద్యార్థినులకు తెలిపారు.