రాయల్ పోస్ట్ న్యూస్ కొమరం భీమ్ ఆసిఫాబాద్:30 తో ముగియనున్న అడ్మీషన్ల గడువు : డీఐఈఓ
రెగ్యులర్ ఇంటర్ అడ్మీషన్లకు లాస్ట్ ఛాన్స్
ఇంటర్మీడియేట్ అడ్మీషన్ల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనున్నట్లు జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మీషన్లకు చివరి అవకాశంగా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు స్పష్టం చేసారు. గడువు తేదీలోగా ప్రైవేట్ మరియు ప్రభుత్వరంగ కళాశాలల విద్యార్థుల గుర్తింపు ఫీజు సైతం చెల్లించాలని అన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశాల మేరకు మొదటి సం. జనరల్ మరియు ఒకేషనల్ గ్రూపుల అడ్మీషన్లకు కేవలం ఈ నెల 30 వ తేదీ వరకు మాత్రమే పెంచడం జరిగిందని అన్నారు. కళాశాలల్లో గతంలో చేరిన వారి ఫోటో, సంతకం తదితర వివరాలను సైతం గడువు లోగా నవీకరించాలని అన్నారు. కావున కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 11 ప్రభుత్వ, 23 ప్రభుత్వ రంగ మరియు 6 ప్రైవేట్ మొత్తం 40 కళాశాలలున్నాయని, ఆయా కళాశాలల్లో అడ్మీషన్ పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.