రైతులు పండించిన వరిని తగిన మద్దతు ధర ఇచ్చి వెంటనే కొనుగోలుచేయాలి…

రాయల్ పోస్ట్ కలెక్టరేట్/ మహ్మద్ అతహర్ కో కన్వీనర్ భువనగిరి పార్లమెంట్ వై. ఎస్.ఆర్.తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.అతహర్ మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వం కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది అని రాజకీయంలో వింతగా రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తూ రైతులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు.రైతులు ఎండనకా వాననకా కష్టపడి వరి పండిస్తే చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటాం అని చెప్పి ఈరోజు కొనకపోవడం వలన రైతులు అదే వరి కుప్పల మీద గుండె ఆగి చనిపోతున్నారు.కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనకపోవడం వలన వర్షాలు పడి వడ్లు మొలకెత్తిపోతున్నాయి అయినా ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి లక్షల కోట్లు ఖర్చు పెట్టు నీటి ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వరి ఎందుకు కొనడం లేదని వరి వేస్తే ఉరే అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు ద్రోహిగా మిగిలిపోతారు.వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ తరపునుండి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల వద్ద మొలకెత్తిన వడ్లు తరుగు తీసివేయకుండా చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తగిన మద్దతు ధర వెంటనే చెల్లించి డబ్బులను నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులలో మా పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామనిహెచ్చరించారు.భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ ఇరుగు సునీల్ కుమార్, కో కన్వీనర్ లు రమేష్ గౌడ్ , సమ్మయ్య, లింగా రెడ్డి,రాష్ట్ర ఎస్సీ నాయకులు గనేశ్ నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోడెపు జీవన్ గౌడ్, అమృత సాగర్, జంగయ్య గౌడ్, రహీం షరీఫ్,ములుగు రాములు, యువజన నాయకులు లింగా చారి, ముజాహిద్ సాయి నివాస్, సుధాకర్,అనుదీప్ నాయక్,శ్రీనివాస నాయక్ మైనారిటీ నాయకులు వాహిద్,ఆదిల్, ముబీన్, మహిళా నాయకురాలు మంజుల, వసంత పాల్గొన్నారు..