మోడల్ స్కూల్ హాస్టల్స్ కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలు చెల్లించాలి డిమాండ్….

రాయల్ పోస్ట్ భువనగిరి/ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 198 మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న 1200 మంది కార్మికులకు కనీస వేతనం24 వేళారూపాయలు చెల్లించాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు S. బాలరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న కార్మికుల జిల్లా స్థాయి సమావేశం భువనగిరి లోని వర్తక సంఘం హాల్ లో స్వప్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి S.బాలరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న కేర్ టేకర్, ఏ.ఎన్.ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమేన్ కార్మికులకు ప్రతి నెల కేవలం రూ.6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని,24 గంటలు వారితో పని చేయిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. 2015 నుండి పనిచేస్తున్న కార్మికులకు ఏడు సంవత్సరాలు గడిచినా నేటికీ వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ మరియు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, ESI, PF సౌకర్యాలు అమలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని విమర్శించారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు 8 గంటల పని దినం అమలు తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా S.బాలరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న రోజులలో కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు,ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అనంతరం నూతన జిల్లా కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.
అధ్యక్షులు MD. ఇమ్రాన్,
ఉపాధ్యక్షులు సైదుగాని స్వరూప,
ప్రధాన కార్యదర్శి వాల్కి స్వప్న,
సహాయ కార్యదర్శి జాన్ బీ,
కోశాధికారి చాటక కిష్టమ్మ లను, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.