ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు……

రాయల్ పోస్ట్ /కలెక్టరేట్ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ఆయన ప్రజల నుండి 44 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 25 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయన్నారు.