ఆతీక్ రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్ :పేరిక కులస్థులందరు ఐక్యమత్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వ చీప్ విప్ గంప గోవర్ధన్ అన్నారు వనస్థలిపురం లో నిర్వహించిన పెఱిక కుల కార్తీకమాస వనభోజనాలు ఫార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎల్బినగర్ జోన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్ష కార్యదర్శులు గా సుందరి వీర భాస్కర్, ఆరెపురి సత్యం లను ఎన్నుకున్నట్లు కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పెరిక కుల ప్రముఖులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ శాసన మండలి సభ్యులు బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిక కులస్థులు రాజకీయంగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఎమ్మేల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో పెరిక సంఘం భవనానికి స్థలం కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వసతి గృహం అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం, సుంకర సత్యనారాయణ, కరణం శ్రీకాంత్, ఘటిక అజయ్ కుమార్, సుంకరి ఆనంద్, కల్నల్ శ్రీనివాస రావు, బొలిశెట్టి వీరయ్య, అంకతి విజయ్ కుమార్, బండి నిర్మల, వలిశెట్టి లక్ష్మీ శారద. గోల్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.