ఎండి. అతీక్ రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్: హబ్సిగూడ లో టిఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే లు రాజయ్య, ఆర్మూర్ రమేష్, గువ్వల బాలరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఎస్సీ వర్గీకరణ కోసం చర్చించిన పాపాన పోలేదు. జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.