రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: అమ్మాయిలపై, మహిళలపై జరుగుతున్న దాడులను హింసకు కారణం అవుతున్న మాదక ద్రవ్యాలనుఅరికట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బోనగిరి పట్టణంలో ఎస్టీ బాలికల హాస్టల్ లో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలపై జరిగే దాడులను ప్రతిఘటిస్తాం హింసలేని సమాజాన్ని నిర్మిద్దాం అనే అంశంపై ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రమేశ్వరి గారు అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 25 నుండి అంతర్జాతీయ హింస వ్యతిరేక దినం నుండి డిసెంబర్ 10 వరకు మానవ హక్కుల దినోత్సవం వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలలో సెమినార్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మహిళ పట్ల లింగ వివక్షత కొనసాగుతుంది అన్నారు నేటి ఆధునిక మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా దూసుకుపోతున్న వివక్ష కొనసాగుతూనే ఉంది మహిళలలు రాజకీయంగా , విద్య ,లో క్రీడల్లో , వైద్యంలో, అంతరిక్షం, టెక్నాలజీ వంటి, అనేక రంగాల్లో ఆత్మ స్థైర్యంతో స్వశక్తితో ముందుకు వెళ్తున్న మహిళల పట్ల వివక్షత చులకన భావం కొనసాగుతుందని ఆందోళన చెందారు మహిళలకు అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి మనదేశంలో ప్రతి 16 నిమిషములకు ఒక మహిళ అత్యాచారం గురవుతుంది ప్రతి ముగ్గురు స్త్రీలల్లో ఫిజికల్ హింసకు గురవుతున్నారు అని మరియు అక్రమ రవాణా కేసులో 71 శాతం మహిళలు బాలికలే ఉన్నారు వీరిలో కూడా ప్రతి నలుగురిలో ముగ్గురు అత్యాచారాలకు గురవుతున్నరు 2020లో మొత్తం మహిళలకు సంబంధించి మూడు లక్షల 70 ఒక వెయ్యి 500 మూడు కేసులు నమోదు కాగా వీటిలో 30.9% ఆందోళన చెందారు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాల లో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది, మహారాష్ట్ర మూడో స్థానంలో భ్రూణహత్యల గుజరాత్ మొదటి స్థానంలో ఉంది ఈ రకంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నాయి బాధిత మహిళలకు అండగా ఉండవలసిన ప్రభుత్వం మే వ్యతిరేకంగా అవలంబిస్తున్నారు ఉదాహరణ కతువ ఘటన .తెలంగాణ రాష్ట్రంలో దిశ, చైత్ర ఘటన మరియు వరంగల్ లో ఆరు సంవత్సరాల అమ్మాయి పై అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ప్రభుత్వాలు మూలాల్లోకి వెళ్లి మూలాలకు వెతక వలసి ఉంది అని అన్నారు వీటన్నిటికీ కారణం మద్యం ,మాదక ద్రవ్యాలు, అశ్లీలత చిత్రాలు ,పోర్న్ సైట్ నిషేధించాలని అట్లాగే వర్మ కమిషన్ సిఫార్సులను అమలుచేయాలని స్త్రీ ఔన్నత్యాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలి మహిళలను గౌరవంగా చూసే విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సెమినార్లో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ మహిళా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పని చేస్తుంది అమ్మాయిలకు మహిళలకు అండగా నిలబడుతుందని అన్నారుచట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు దాసరి మంజుల , జిల్లా ఉపాధ్యక్షురాలు కొండమడుగు నాగమణి, జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు.