అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ మోత్కూర్ భువనగిరి : పట్టణ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే గారి 131 వ, వర్ధంతి సమావేశాన్ని మహాత్మ జ్యోతిబా పూలే గారి విగ్రహానికి పూలమాలవేసి ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బహుజనులకు చదువు నేర్పడం కొరకు 1848వ, సంవత్సరంలో పాఠశాల ను ప్రారంభించిన గోప్ప సామాజిక విప్లవకారుడు. తన సహచరీ అయిన మాతా సావిత్రిబాయి గారికి కి చదువు నేర్పీ, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సమాజానికి విద్యను అందించిన వీర ధనుడు మహాత్మ జ్యోతిబా పూలే , కాబట్టి ఆయన ఆలోచనలు అందరికీ అందాలంటే ఆయన సిద్ధాంతాలను ఊరి, ఊరి కి గడప,గడపకు చేరవేయాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే అని తుంగతుర్తి నియోజకవర్గం ఉపాధ్యక్షులు కె బి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చిరగడం ప్రతాప్ , కో-కన్వీనర్ బర్రే మహేష్ , మండల నాయకులు కుర్మేటీ నవీన్ , నియోజకవర్గం మాజీ అధ్యక్షులు కొంపల్లి రాజు, మేడి చింటు, గణేష్, శివ, మణి, జిట్ట మురళి తదితరులు పాల్గొన్నారు