రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :బహుజనుల ఆరాధ్యదైవం, బీసీల ఆశాజ్యోతి, మహాత్మ జ్యోతిరావు పూలే గారి 131 వ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహ స్వామి ఆధ్వర్యంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 29 నుండి జరుగు పార్లమెంట్ సమావేశాల్లో బీసీల జన గణ కు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలని, దేశవ్యాప్తంగా ఉన్న బీసీల జనాభా లెక్కలు లెక్కించాలని, అంతేకాకుండా కేంద్రంలో కేంద్ర బీసీ సంక్షేమ శాఖ ను ఏర్పాటుచేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాటూరి అశోక్ బీసీ సంఘం గౌరవ సలహాదారులు లక్ష్మీనారాయణ భువనగిరి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సాబన్ కార్ వెంకటేష్, భువనగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల క్రాంతి కుమార్, రమేష్, యాదగిరి, లక్ష్మణ్, కృష్ణ సత్యనారాయణ ప్రసాద్, తదితర బిసి నాయకులు పాల్గొన్నారు