రాయల్ పోస్ట్ న్యూస్/ భువనగిరి :డిసెంబర్ 5,6,7 తేదీలలో పోచంపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం రెండవ మహాసభల సందర్భంగా 5వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు బాలాజీ పంక్షన్ హాల్ లో “వ్యవసాయ రంగ సంస్కరణలు ” పై నిర్వహిస్తున్న సదస్సులో రైతులు, వ్యవసాయ కూలీలు,ప్రజలు, అభ్యుదయ వాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు గూడూరు అంజి రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో రైతులతో కలిసి సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా నర్సింహ, అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం చాలా పెద్ద ఎత్తున దెబ్బతిని రైతుల ఆత్మహత్యలు పెరిగిన పరిస్థితి ఉన్నదని అన్నారు. ఈ వాన కాలం పంట రైతుల నుండి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగనాటకాలు ఆడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల ధాన్యము కొనుగోలు వేగవంతం చేసి రైతులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేసినారు.ప్రదానంగా ఈ మహాసభల్లో గడిచిన నాలుగేళ్ళ కాలంలో సిపిఎం చేసిన ఉద్యమాలు, పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాల కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. 5వ తేదీన నిర్వహించే సదస్సుకు ముఖ్య అతిథులుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, 6,7 తేదీలలో జరుగు ప్రతినిధుల మహాసభకు ముఖ్యఅతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యద�