మక్సూద్ రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యాపేట: ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేట స్టేజ్ వద్దగల శ్రీ సంతోషిమాత ఉద్యాన వన క్షేత్ర0 లో ఆదివారం19 వ కార్తిక వనసమారాదన కార్యక్రమం శ్రీ సంతోషిరూప దేవి సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా మంత్రి గంగానది దిపోత్సవం,పార్థివలింగాభిషేకం,అమలక పూజ తో పాటు ప్రత్యేకంగా 108 శివలింగాలతో ఏర్పాటు చేసిన మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం పూజలో పాల్గొన్నారు..సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలు నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయ అధ్యక్ష,కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా,బ్రాహ0డ్లపల్లి మురళిధర్,కమిటీ సభ్యులు పులిగిళ్ళ అర్జున్ గుప్తా,నరేంద్రుని విద్యాసాగర్ రావు,పబ్భా ప్రకాష్,బ్రాహ్మాండ్లపల్లి దేవి దత్హు,కొత్త మల్లి కార్జున్,బ్రాహ్మణపల్లి బ్రాహ్మయ్య,నామిరెడ్డి పాపిరెడ్డి, తాళ్లపల్లి రామయ్య, దేవరశెట్టి సోమయ్య,బోనగిరి విజయ్ కుమార్,పాలవరపు రామమూర్తి, గోపారపు రాజు,తిరునగరు యాదగిరి,బ్రాహ్మ0డ్లపల్లి బాలచంద్రుడు,నూకా రవి,శివ, గుండా రమేష్ దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు