రాయల్ పోస్ట్ న్యూస్ తార్నాక హైదరబాద్ :అక్రమ భవన నిర్మాణాల దందా జోరుగా సాగుతోంది. ఎరకుంట చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సమాచారంతో మారేడుపల్లి ఎమ్మార్వో అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. వివరాల్లోకి వెళితే ఎర్ర కుంట చెరువు లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాకూడా కోర్టును దిక్కరిస్తూ అధికార పార్టీ నాయకుడు నిర్మాణాలు చేపట్టాడు. స్థానిక ప్రజలు పలుమార్లు మారేడుపల్లి ఎమ్మార్వో కు ఫిర్యాదు చేయగా శనివారం డిప్యూటి ఎమ్మార్వో ఆధ్వర్యంలో నిర్మాణాన్ని కూల్చివేశారు కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ ఎర్ర కుంట చెరువు నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మారేడిపల్లి ఎమ్మార్వో తెలియజేశారు.