రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్ జిల్లా: భీంగల్ మండలం గోనుగోప్పుల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ హరి హర క్షేత్ర 11వ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిత్య అన్నదానం మొదటి రోజున సుప్రభాత సేవ అభిషేకం పట్టువస్త్రాలతో అలంకరణ రుత్విక్ వాచనం గోపూజ మండపారాధన గరుడ నందిత పటాది వాసం పుణ్యాహవాచనం గణపతి పూజ గరుడ పటాది వాసం నంది పటాది వాసం నవగ్రహ మంట ఆరాధన హోమాలతో ఆవహిత దేవత హోమాలు మొదటిరోజు జరుగును. మూడు రోజులపాటు శ్రీ శ్రీ శ్రీ హరి హర క్షేత్ర వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా శంకరుడు లింగం రూపంలో దర్శనమిస్తాడు.అంగ రంగ వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు కలవు చివరి రోజున రథయాత్ర జరుగును. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు వీడీసీ సభ్యులు గ్రామంలోని చిన్నలు పెద్దలు వివిధ గ్రామాల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.