రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి MD. ఇమ్రాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద AITUC ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా MD. ఇమ్రాన్ మాట్లాడుతూ కార్మికుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకు వచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తులు అమ్మివెస్తు కార్పొరేట్ శక్తుల పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్నాయని అన్నారు . ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను విక్రయిస్తూ కార్మికుల ఉద్యోగాలు ఊడా కొడుతున్నారని విమర్శించారు. దేశంలో కరోనా తో కార్మికులను పస్తులు ఉంటే ఆదాని, అంబానీ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయని దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ కార్మికుల ,ప్రజల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిన విధంగానే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను కూడా రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నూతన లేబర్ కోడ్ ల వలన కార్మికులు తమ సర్వహక్కులు కోల్పోతున్నారని, సంఘం పెట్టుకునే హక్కు, వేతానాలు అడిగే హక్కు, సమ్మె చేసే హక్కు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమ విధానాలు మార్చుకుని లేబర్ కోడ్ లు రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి సామల శోభన్ బాబు,ఏఐటీయూసీ నాయకులు చొప్పరి సత్తయ్య,గొర్ల లక్ష్మణ్, ఆదిమూలం బాబు, చంద్రయ్య,చాంద్, భూపాల్ రెడ్డి,వెంకటయ్య,అజయ్, కృష్ణ,అశోక్,సురేష్, వెంకటేష్ ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.