రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి :రైతుల జీవితం కల్లాల్లో తెల్లారుతోందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ‘కర్షకులకు అండగా కాంగ్రెస్‌’ అనే నినాదంతో కిసాన్ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వరి దీక్ష కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. హైదరాబాద్ ఇందిరాపార్కులోని ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న దీక్షకు షాద్ నగర్ నియోజకవర్గం నుండి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కిసాన్ కాంగ్రెస్ శ్రేణులు సుమారు 40 వాహనాల్లో దీక్షకు తరలివెళ్లారు. టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర ఛైర్మన్ అన్వేష్‌ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి హెచ్ హనుమంతరావు, వీర్లపల్లి శంకర్ తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల పాటు జరిగే దీక్షలో భాగంగా శనివారం రాత్రి ముఖ్యనేతలు దీక్షాస్థలిలోనే ఉండనున్నారు. వరిధాన్యంపై వివిధ దిన పత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగులను దీక్షా ప్రాంగణంలో ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా
వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల జీవితం కల్లాల్లో తెల్లారుతోందని అన్నారు. 10 వేల కోట్లు పెట్టి వరి ధాన్యం కొనుగోలు చేయలేరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ డ్రామాలు ఆపేయాలని హితవుపలికారు. కేసీఆర్ జంతర్‌మంతర్ దగ్గర ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ముందు వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు
కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు..