రాయల్ పోస్ట్ న్యూస్ మహబూబ్ బాద్: యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలియజేశారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల స్థాపనల పై జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు .

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ క్రింద ఆన్లైన్ ప్రక్రియ ద్వారా 43 దరఖాస్తులు స్వీకరించగా 38 ఎంపిక చేయటం చేయడం జరిగిందని 32 శాఖాపరంగా పరిశీలన జరగగా మంజూరు చేశామన్నారు మరో ఐదు దరఖాస్తులు శాఖాపరంగా పరిశీలనలో ఉన్నాయని ఒక దరఖాస్తును మాత్రమే తిరస్కరించడం జరిగిందన్నారు.

మరిన్ని పరిశ్రమలను స్థాపించేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆ రీతిగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి సత్యనారాయణ గిరిజన అభివృద్ధి అధికారి దిలీప్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ పి డి బాలరాజు లీడ్ బ్యాంక్ మేనేజర్ రాఘవేంద్ర రావు బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.