రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ: మైనారిటీ మతస్తులు లైన ముస్లిం, క్రిస్టియన్స్ లపై బిజెపి ఆర్ఎస్ఎస్ దాడులను నిరసిస్తూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు డిసెంబర్ 1న నల్లగొండ పట్టణంలో జరిగే నిరసన ప్రదర్శనలు జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం జిల్లా కమిటీ సభ్యులు దండం పల్లి సత్తయ్య పిలుపునిచ్చారు
శనివారం ర్యాలీ కరపత్రాన్ని దేవరకొండ రోడ్డు హరిత హోటల్ దగ్గర ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ అధికారం సాధించడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టడం మతకలహాలు సృష్టించడానికి ఏకైక సాధనంగా సంఘ పరివార్ భావిస్తుందని అన్నారు. మన రాజ్యాంగం మత ప్రమేయం లేని రాజ్యాంగ మని పౌరులందరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించడానికి స్వేచ్ఛ ఇచ్చిందని ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రార్ధన చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ఒక పౌరుని పై మరొక పౌరుని అభిప్రాయాలను బలవంతంగా రుద్దాడాన్ని నిరోదించినదని తెలిపారు. వివిధ మతాల, వివిధ సంస్కృతుల, వివిధ భాషలు ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని తెలిపారు. లౌకిక దేశమైన మన భారత దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడం సిగ్గుచేటని అన్నారు. మైనారిటీలపై దాడులు చేయడం అంటే రాజ్యాంగపరంగా లభించిన హక్కులపై దాడి చేయడం అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం మైనారిటీ ప్రజలపై దాడులను నిరసిస్తూ *డిసెంబర్ 1న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని *సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ పట్టణంలో సిపిఎం ఆఫీస్ నుండి ఉదయం 11 గంటలకు నిరసన ప్రదర్శన* జరుగుతుందని ప్రజాతంత్ర వాదులు, లౌకిక శక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో సిపిఎం ఎనిమిదో వార్డు శాఖ కార్యదర్శి బచ్చగోని మల్లేష్ ,పట్టణ నాయకులు ఎస్.కె మహబూబ్ అలి, నలప రాజు సైదులు ఓర్సు వెంకటేశ్వర్లు రాంబాబు అవురేషు, మారయ్య,కొండయ్య, ఇఫ్తాకార్,శివ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు .