అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరి :మండల కేంద్రానికి చెందిన యాస నర్సింహా రెడ్డి వృత్తి రిత్యా హమాలీ కాగా కూలి నాలీ చేసిన డబ్బులతో కొంత భూమిని కౌలుకు తీసుకొని వరి వేయగా ఇటీవల మండలంలో ప్రవహిస్తున్న బునాదిగాని కాల్వ అసంపూర్తి పనులతో గండ్లు పడగా పై నుండి వస్తున్న నీళ్లతో వంపు ప్రాంతంలో ఉన్న నర్సింహా రెడ్డి పంట పొలం సుమారుగా మూడు ఎకరాలు నీటి పాలు కావడం జరిగింది.బాధిత రైతు మాట్లాడుతూ నేను కూలి చేసుకొంటూ కొంత భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేయగా కోత సమయంలో సమీపాన ఉన్న బునాదిగాని కాల్వలో నుండి వచ్చిన నీళ్లు మా కోతకు వచ్చిన వరి పొలంలో పడడంతో పూర్తిగా పొలం గట్లు తెగడం వరి చేను మొత్తం సుమారు మూడు ఎకరాల వరి నీటి పాలు కావడం జరిగింది అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరు పట్టించుకోవడం లేదని పెట్టిన పెట్టుబడి కూడా ఎల్లే పరిస్థితి లేదని చావల్నా బతకాలో అర్దం కావడం లేదని కన్నీటి పర్యంతం అయ్యాడు.