అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరి :మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు గాను నిధులు మంజూరు చేయాలని కోరుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ గారు.
ఈ క్రింది పనులను తమ ఎంపీ నిధుల నుండి నిధులు మంజూరు చేయగలరని కోరడం జరిగింది.
1)అసంపూర్తిగా ఉన్న ఫంక్షన్ హాల్ నిర్మాణం
2) వీధులలో సిసి రోడ్ల నిర్మాణం గురించి
3)జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డైనింగ్ హాల్ నిర్మాణం
4)బీసీ బాలికల హాస్టల్ ప్రహరీ గోడ నిర్మాణం
5)పద్మశాలి సంఘం భవనం నిర్మాణం.
6)గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ0.
7.తిమ్మాపురం x రోడ్ సబ్ స్టేషన్ వరకు బీటి రోడ్డు నిర్మాణం. మార్కెట్ యార్డు నుండి కాముని గూడెం వరకు బీటి రోడ్ నిర్మాణం. మొదలైన పనులకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు పోతగాని మల్లేష్ వార్డ్ మెంబర్ కోరే మల్లేష్ ,యువజన నాయకులు తొండల అనిల్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.